Raj Tharun: రానా చేతుల మీదుగా 'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్!

  • రాజ్ తరుణ్ నుంచి 'స్టాండప్ రాహుల్'
  • కథానాయికగా వర్ష బొల్లమ్మ
  • ముఖ్యమైన పాత్రలో ఇంద్రజ
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 
Stand Up Rahul movie teaser release

సాధారణంగా ఏ హీరో అయినా తొలి సినిమాతోనే తనకి హిట్ పడాలని కోరుకుంటాడు. కానీ రాజ్ తరుణ్ అదృష్టం .. వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ మూడు సినిమాలతో ఇటు యూత్ లోను .. అటు మాస్ ఆడియన్స్ లోను ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆ తరువాత రాజ్ తరుణ్ కి అవకాశాలైతే వరుసగా వచ్చాయిగానీ, అవి హిట్ కేటగిరీలోకి మాత్రం చేరలేకపోయాయి. అదే సమయంలో కొత్త హీరోల పోటీ కూడా బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కి అవకాశాలు తగ్గుతూ వెళ్లాయి.

తాజాగా ఆయన 'స్టాండప్ రాహుల్' అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో సంతూ మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 'రానా' చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. డిఫరెంట్ లుక్ తో రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. ముఖ్యమైన పాత్రల్లో ఇంద్రజ .. మురళీ శర్మ నటించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News