చంద్రబాబు దగా చేస్తే.. జగన్ ఆదుకుంటున్నారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
- రైతు సంక్షేమంపై చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారు
- రుణమాఫీ చేయకుండా రైతులను చంద్రబాబు మోసం చేశారు
- పంటబీమా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు
రైతులకు పంటబీమా ఇవ్వలేక గత టీడీపీ ప్రభుత్వం చతికిలపడితే... పంట దిగుబడి తగ్గినా బీమా వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారని కాకాణి కొనియాడారు. పంటబీమా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని అన్నారు. మిల్లర్లతో చేతులు కలిపి రైతులను టీడీపీ నేతలు ముంచేశారని చెప్పారు. రైతులను మోసం చేసిన చరిత్ర టీడీపీదని, వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని అన్నారు. నీతి, నిజాయతీ ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని కాకాణి సవాల్ విసిరారు.