అరుదైన ఘనత సాధించిన హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత
- ఇన్ స్టాగ్రామ్ లో భారీగా సంపాదిస్తున్న తారలు
- ప్రపంచ జాబితాలో అశ్రితకు 377వ స్థానం
- ఆసియా స్థాయిలో 27వ స్థానం
- ఒక్కో పోస్టుకు రూ.29 వేలు పొందుతున్న అశ్రిత!
అశ్రిత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో పోస్టుకు సుమారుగా రూ.29 వేలు లభిస్తాయట. ఇంతకీ అశ్రిత పోస్టుల్లో ఉండేది కుకింగ్ వీడియోలు. ఇన్ఫినిటీ ప్లాటర్ అనే అకౌంట్ తో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వంటల వీడియోలను పంచుకుంటుంది. ఇన్ స్టాలో ఇన్ఫినిటీ ప్లాటర్ అకౌంట్ కు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బిస్కట్లు, కేకులు, ఇతర స్నాక్స్ ఐటమ్స్ లో కొత్త రకాలను అశ్రిత సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంటుంది.
అశ్రిత ప్రస్తుతం స్పెయిన్ లో ఉంటోంది. ఆమెకు రెండేళ్ల కిందట వినాయక్ రెడ్డితో వివాహం జరగ్గా, అప్పటి నుంచి స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో నివసిస్తోంది.