దానం చేయాలంటూ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ వెంటప‌డ్డ యాచ‌కులు.. వీడియో వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దానం చేయాలంటూ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ వెంటప‌డ్డ యాచ‌కులు.. వీడియో వైర‌ల్

 Pragya Jaiswal  Mobbed By Beggars
  • జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసిన ప్ర‌గ్య
  • బ‌య‌ట‌కు వ‌చ్చి చూసే స‌రికి యాచ‌కులు
  • డబ్బులిచ్చి కారులో వెళ్లిపోయిన హీరోయిన్
తమకు అంతోఇంతో దానం చేయాలంటూ కొందరు యాచకులు హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ వెనుక‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో వైర‌ల్ అవుతోంది. జిమ్‌కు వెళ్లిన ప్ర‌గ్య క‌స‌ర‌త్తులు ముగిశాక బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతే.. అప్పటికే అక్క‌డ ఆమె కోసం ఎదురు చూస్తోన్న యాచ‌కులు డ‌బ్బు ఇవ్వాలంటూ వెంటపడ్డారు. వారిని చూసి ఇబ్బందిపడ్డ ప్రగ్యకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఇంతలో వాళ్లంతా ఆమె చుట్టూ చేరి ముందుకు క‌ద‌ల‌నివ్వ‌కుండా నిల‌బ‌డ్డారు.

వారి నుంచి తప్పించుకుని ఆమె వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది. చివ‌ర‌కు ఎలాగోలా కారులోకి వెళ్లి కూర్చుంది. అయినా కూడా వాళ్లు వదలకుండా వెళ్లి.. కారు కిటికీ వ‌ద్ద నిల‌బ‌డి చేతులు చాపారు. ఇక లాభం లేదనుకుని కొంత డబ్బు తీసి, వారిలో కొంద‌రికి ఇచ్చిన ప్రగ్య అంద‌రూ పంచుకోవాల‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ కారు వెళ్తున్న స‌మ‌యంలోనూ ఇంకా డ‌బ్బు ఇవ్వాలంటూ యాచ‌కులు ఆమె వెంట ప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అన్నట్టు, ప్రస్తుతం ఈ అమ్మ‌డు బాల‌య్య హీరోగా రూపుదిద్దుకుంటోన్న‌ అఖండ సినిమాలో నటిస్తోంది.  

    
Pragya Jaiswal
Tollywood
Viral Videos

More Telugu News