యాంటీ కొవిడ్ డ్రగ్ '2-డీజీ' ఉత్పత్తికి లైసెన్స్ పొందిన లారస్ ల్యాబ్స్
- 2-డీజీని అభివద్ధి చేసిన డీఆర్‌డీవో
- ఓ మోస్తరు నుంచి మధ్యస్థాయి లక్షణాలున్న వారికి అద్భుత ఔషధం
- ఈయూఏ కోసం సీడీఎస్‌సీవోకు లారస్ ల్యాబ్స్ దరఖాస్తు
నోటి ద్వారా తీసుకునే 2-డీజీ అత్యవసర వినియోగ అనుమతికి డీసీజీఐ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. మరోవైపు, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) కోసం సీడీఎస్‌సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్)కు లారస్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. యాంటీ కొవిడ్ డ్రగ్ 2-DG ఫస్ట్ బ్యాచ్‌ను ఈ ఏడాది మే నెలలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ విడుదల చేశారు.