కరోనాతో చావు అంచుల వరకు వెళ్లిన హైదరాబాద్ బాడీ బిల్డర్.. సోనూసూద్ సాయంతో కోలుకున్న సుశీల్ కుమార్
- కరోనాతో ఏప్రిల్‌లో స్థానిక ఆసుపత్రిలో చేరిన సుశీల్ కుమార్
- సోనూ సూద్ సాయంతో మే 19న యశోద ఆసుపత్రికి
- అప్పటికే 80 శాతం ఇన్ఫెక్షన్‌కు గురైన ఊపిరితిత్తులు
- ఎక్మో చికిత్స అవసరం లేకుండానే కోలుకున్న వైనం
దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే నటుడు సోనూసూద్ సాయం అర్థించారు. ఆయన వెంటనే స్పందించడంతో మే 19న సుశీల్ కుమార్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే అతడి ఊపిరితిత్తులు 80 శాతం ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు వైద్యులు గుర్తించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం ఎక్మో చికిత్స అవసరం లేకుండానే సుశీల్ కోలుకున్నాడు. దీంతో తాజాగా సుశీల్ కుమార్‌ను డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. కొవిడ్ సోకకముందు 100 కిలోలకు పైగా ఉన్న సుశీల్ కుమార్ ప్రస్తుత బరువు 72 కిలోలకు తగ్గిపోయిందని చెప్పారు. కాబట్టి తాము యువకులమని, ఆరోగ్యంగా ఉన్నామని, కరోనా తమను ఏమీ చేయలేదన్న అపోహలు వీడాలని కోరారు.