అదే నేను చేసిన పొరపాటు: శ్రీను వైట్ల
- శ్రీను వైట్లకి మంచి క్రేజ్
- వరుస బ్లాక్ బస్టర్లు
- ఆ తరువాత పరాజయాలు
- తగ్గిన అవకాశాలు
తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను వినోదప్రధానమైన సినిమాలనే చేస్తూ వెళ్లాను. నా సినిమాలు ఒకే రకంగా ఉంటున్నాయనే టాక్ రావడంతో, కొత్తగా చేయాలనే ఉద్దేశంతో రూట్ మార్చాను. కానీ శ్రీను వైట్ల సినిమాలు ఇలాగే ఉండాలని కోరుకున్న ప్రేక్షకులకు, నేను నా స్టైల్ ను మార్చుకోవడం నచ్చలేదు. అందువల్లనే ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి. నా స్టైల్ సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్న సమయంలో, కొత్తదనం కోసం ట్రై చేయడమే నేను చేసిన పొరపాటు .. ఇకపై అలా జరగదు" అని చెప్పుకొచ్చారు. మంచు విష్ణు హీరోగా ఆయన 'డి అండ్ డి' చేయనున్న సంగతి తెలిసిందే.