మాంసం కోసం క్రూరం.. బతికి ఉండగానే పాడి గేదెల తొడలు కోసిన యువకులు!
- సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఘటన
- మాంసం కోసం దారుణం
- నిందితుల్లో ముగ్గురు ఏపీ వారు కాగా, ఒకడు నేపాలీ యువకుడు
రాత్రివేళ ఆ పాకలో దూరిన నలుగురు నిందితులు మాంసం కోసం రెండు గేదెల తొడలు కోశారు. దీంతో విలవిల్లాడిన గేదెలు రక్తస్రావమై చనిపోయాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతు చనిపోయిన గేదెలను చూసి విస్తుపోయాడు. విషయం గ్రామస్థులకు చెప్పి నిందితుల కోసం గాలించగా వారంతా వ్యవసాయ క్షేత్రంలో మాంసం వండుతూ కనిపించారు. గ్రామస్థులను చూసి నిందితుల్లో ముగ్గురు పరారు కాగా, నేపాలీ యువకుడు సందీప్ (25) వారికి పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.