వ‌రుస‌గా మూడో రోజు సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ లేఖ‌!

raghu rama writes letter to jagan
  • పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్ ప‌థ‌కాలపై లేఖ‌
  • ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలి
  • సాయాన్ని రూ.ల‌క్ష‌కు పెంచుతామ‌న్నారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ‌రుస‌గా మూడో రోజు మ‌రో లేఖ రాశారు. వృద్ధాప్య పింఛ‌న్ల విషయంతో పాటు ఆంధ్రప్ర‌దేశ్‌లో సీపీఎస్‌ విధానం రద్దు చేయాల‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని కోరుతూ ఇప్ప‌టికే ఆయ‌న రెండు లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే.

పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల విష‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలంటూ నేడు మరో లేఖ రాశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌స్తే పెళ్లికానుక సాయం పెంచుతామ‌ని వైసీపీ ఎన్నిక‌ల‌కు ముందు చెప్పింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ సాయాన్ని రూ.ల‌క్ష‌కు పెంచుతామ‌ని ప్ర‌క‌టించిన‌ట్లు గుర్తు చేశారు. దీంతో ప్ర‌జ‌ల నుంచి వైసీపీకి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని, ఇప్పుడు ఆ హామీని వెంట‌నే నిల‌బెట్టుకోవాల‌ని అన్నారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
YSRCP
Jagan

More Telugu News