ఇది జగన్ రెడ్డి పాపం... ప్రజలకు శాపం: నారా లోకేశ్
- ఏపీలో పెట్రోల్ లీటరు ధర రూ.101.61
- విమర్శలు సంధించిన లోకేశ్
- రాష్ట్రాన్ని పెట్రోల్ ధరల పెంపులో నెంబర్ వన్ గా నిలిపారని ఎద్దేవా
- అన్ని రేట్లు పెరిగాయని కామెంట్
బాదుడు రెడ్డి ధాటికి పెట్రోల్ ధర శుక్రవారం సెంచరీ దాటి రూ.101.61కి చేరిందని, దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల పెంపులో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపారని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉందని, కొవిడ్ కేసుల్లో 5వ స్థానానికి చేర్చారని విమర్శించారు. ఇది జగన్ రెడ్డి పాపం, ఏపీ ప్రజలకు శాపం అని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్... విజయవాడలో పెట్రోల్ ధరలను చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, తిరువనంతపురం నగరాల్లో పెట్రోల్ ధరలతో పోల్చుతూ ఓ పట్టికను ప్రదర్శించారు. అందులో విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 100 రూపాయల కంటే ఎక్కువ ఉండగా, ఇతర దక్షిణాది నగరాల్లో వంద రూపాయలకు లోపే ఉంది.