ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం.. ఎరుపు, నీలి రంగు ప్యాకెట్లలో ఔషధం
- ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందు
- ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవన్న కాకాని
- కొవిడ్ సోకిన వారికి ఎరుపు రంగు ప్యాకెట్ మందు
- కరోనా రాని వారికి నీలి రంగు ప్యాకెట్ లో మందు
ఇప్పటికే కొవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ లోని మందు వాడాలని, కరోనా రాని వారు నీలం రంగు ప్యాకెట్ లోని మందు వాడాలని గోవర్ధన్‌రెడ్డి వివరించారు. సర్వేపల్లిలో మందు పంపిణీతోనే ఆనందయ్య మందు ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తామని తెలిపారు.
రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేస్తామని చెప్పారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని తెలిపారు.