జమ్మూకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- పోలీసుల బృందంపై గ్రనేడ్లు విసిరిన ముష్కరులు
- ఏడుగురు సామాన్య పౌరులకు తీవ్ర గాయాలు
- క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు
- పుల్వామా జిల్లాలో ఘటన
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి ముష్కరుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. గత నెల 26న సైతం ఇదే తరహాలో ముష్కరులు త్రాల్ ప్రాంతంలోనే సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. కానీ, ఈ ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలు కాకపోవడం గమనార్హం.