ఓటుకు నోటు కేసు: ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్... కొట్టివేసిన హైకోర్టు
- హైకోర్టులో రేవంత్ కు చుక్కెదురు
- ఈ కేసు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందన్న రేవంత్
- గతంలో ఇదే అంశంలో ఏసీబీ కోర్టులో పిటిషన్
- పిటిషన్ ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు
- ఇప్పుడు హైకోర్టులోనూ అదే ఫలితం
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్ తో బేరాలు ఆడుతూ రేవంత్ ఓ వీడియోలో కనిపించడం నాడు సంచలనం సృష్టించింది. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ స్టీఫెన్ సన్ ను రేవంత్ కోరిన సమయంలో, అక్కడ సంచుల్లో రూ.50 లక్షల నగదు ఉండడం ఆయనపై ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.