నాగ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన రష్మీ!
- బుల్లితెరపై విపరీతమైన క్రేజ్
- వెండితెరపై కూడా హాట్ బ్యూటీగా పేరు
- ప్రవీణ్ సత్తారుతో చేసిన 'గుంటూరు టాకీస్'
- మరోసారి ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నాగార్జున సినిమాలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా 'గోవా'లో మొదటి షెడ్యూల్ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రష్మీని తీసుకున్నారట. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ 'గుంటూరు టాకీస్' చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు.