అమానుషం.. మాస్కు ధరించలేదని చేతికి మేకులు గుచ్చిన పోలీసులు!

UP police nails a man for not wearing mask
  • యూపీలోని బరేలీ జిల్లాలో అమానుష ఘటన
  • యువకుడిని చితకబాది మేకులు గుచ్చిన పోలీసులు
  • జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడి తల్లి
కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో కొందరు పోలీసులు అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మాస్కులు ధరించని వారికి ఏ రాష్ట్రంలో అయినా జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూపీ పోలీసులు మాత్రం బాధితుడిపై తమదైన మార్కును చూపించారు. మాస్కు ధరించని ఓ యువకుడిని చితకబాదారు. అంతేకాదు, అతని చేతికి, కాలికి మేకులు కొట్టారు. యూపీలోని బరేలీ జిల్లాలో ఈ దారుణం సంభవించింది.

పోలీసుల అరాచకానికి బలైన యువకుడి పేరు రంజిత్. అతని చేతికి, కాలికి పోలీసులు మేకులు గుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నొప్పి భరించలేక అతను తల్లడిల్లిపోతున్న వీడియో నెటిజెన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

మరోవైపు, ఈ ఘటనపై బాధితుడి తల్లి శైలజా దేవి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు తమదైన శైలిలో మరో వాదన వినిపిస్తున్నారు. ఓ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు నుంచి తప్పించుకోవడానికి రంజిత్ తనకు తానే మేకులు గుచ్చుకున్నాడని పోలీసులు చెపుతున్నారు. మాస్క్ ధరించనందుకు అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
Go Back to Shorts
Uttar Pradesh
Police
Mask
Nails

More Telugu News