'గరుడ వేగ' దర్శకుడితో వరుణ్ తేజ్!
- వరుణ్ తేజ్ బాక్సర్ గా 'గని'
- భార్యా బాధితుడిగా 'ఎఫ్ 3'
- ప్రవీణ్ సత్తారుకు గ్రీన్ సిగ్నల్
ఈ సమయాన్ని వృథా చేయకూడదని భావించిన వరుణ్ తేజ్, తరువాత సినిమాను లైన్లో పెట్టే పనిని గట్టిగానే చేశాడట. అలా ప్రవీణ్ సత్తారు కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఆయన వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే అనేశాడని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు .. నాగార్జున హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత వరుణ్ తేజ్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని అంటున్నారు. ఈ లోగా వరుణ్ తేజ్ తన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తాడన్న మాట.