బంగాళాఖాతంలో అల్పపీడనం... నైరుతి ఆగమనానికి తోడ్పడుతుందన్న వాతావరణ శాఖ

IMD predicts a low pressure will be formed in east central bay of bengal
  • ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • తుపానుగా మారుతుందన్న ఐఎండీ
  • ఏపీలో ఓ మోస్తరు వర్షాలు
  • ఈ నెల 21న అండమాన్ లోకి రుతుపవనాలు
  • ఈ నెల 31న కేరళను తాకే అవకాశం
ఈ ఏడాది రుతుపవనాల సీజన్ ప్రారంభానికి ముందు అన్నీ శుభపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను నైరుతి రుతుపవనాల సీజన్ కు మార్గం సుగమం చేయగా, ఈ నెల 23న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాలు సకాలంలో వచ్చేందుకు దోహదపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారుతుందని, ఏపీకి 300 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాక దిశ మార్చుకుంటుందని పేర్కొంది. ఇది పశ్చిమ బెంగాల్/బర్మాలో తీరం దాటే అవకాశాలున్నాయని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

ఇక, ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనుండగా, ఈ నెల 21నే అండమాన్ సముద్రంలో ప్రవేశించనున్నాయి. కేరళను తాకడానికి ముందే రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ వర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
Low Pressure
Bay Of Bengal
IMD
Southwest Monsoon
Andhra Pradesh
India

More Telugu News