రఘురామకృష్ణరాజు నివాసం వద్ద హైడ్రామా... అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు
- రఘురామ వర్సెస్ ఏపీ సర్కారు
- సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న రెబల్ ఎంపీ
- కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
- రఘురామ నివాసంలో గంటపాటు వాగ్యుద్ధం
అయితే, రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు. కాగా రఘురామకృష్ణరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ రఘురామకృష్ణరాజు పుట్టినరోజు!