కరోనా పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన మోదీ!
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విలయం
- పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమీక్ష
- కొవిడ్ పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఆరా
- అంతకుముందు మంత్రులు, ఉన్నాధికారులతో సమావేశం
అంతకుముందు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం తగ్గకుండా చూడాలని ఆదేశించారు. ఇక దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.