ఐపీఎల్: చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి

Mumbai Indians won the toss and opts bowling against Chennai Super Kings
ఐపీఎల్ లో నేడు రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నైని తక్కువ స్కోరుకే పరిమితం చేసి, సులువుగా లక్ష్యాన్ని ఛేదించాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్ కోసం స్పిన్నర్ జయంత్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషామ్, నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో ధవళ్ కులకర్ణి ముంబయి జట్టులోకి వచ్చారు. అటు, చెన్నై జట్టులో ఎలాంటి మార్పుల్లేవని ఆ జట్టు కెప్టెన్ ధోనీ తెలిపాడు.
Go Back to Shorts
Mumbai Indians
Chennai Super Kings
Toss
Bowling
Arun Jaitley Stadium
New Delhi
IPL

More Telugu News