పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఏడో దశ పోలింగ్
- ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
- మొత్తం 34 నియోజకవర్గాల్లో ఎన్నికలు
- బరిలో 284 మంది అభ్యర్థులు
- 796 కంపెనీ కేంద్ర బలగాల మోహరింపు
ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా, ఈ దశలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీఎంసీ తరపున శోభనాదేబ్ ఛటోపాద్యాయ్ బరిలోకి దిగారు. మన్మథనాథ్ నందన్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.