Tina ambani: బావ ముఖేశ్ అంబానీకి టీనా అంబానీ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో పాత ఫొటో
  • కొన్ని గంటల్లోనే వేలాది లైక్స్ ‌
  • ముఖేశ్‌ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన
Tina ambanis special birthday wishes to mukesh ambani

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీకి ఆయన సోదరుడు అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు కలిసి ఉన్న ఓ పాత ఫొటోని షేర్‌ చేస్తూ ముఖేశ్‌‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముఖేశ్‌‌ను ప్రేమకుపాత్రుడైన కొడుకుగా, సోదరుడిగా, బావగా ఆమె అభివర్ణించారు. అలాగే ఆరాధించే తండ్రిగా, తాతగా కూడా పేర్కొన్నారు.

ముఖేశ్ కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఆమె పెట్టిన ఈ పోస్ట్‌ను కొన్ని గంటల్లోనే వేలాది మంది  లైక్‌ చేశారు. అలాగే కామెంట్ల రూపంలో అనేక మంది వీరి ఆప్యాయతను కొనియాడుతూ బిలియనీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.

టీనా అంబానీ గత నెల ముఖేశ్ -నీతూ అంబానీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగానూ ఓ ఫొటోను పంచుకున్నారు. అందులో అనిల్‌ అంబానీ దంపతులు, ముఖేశ్ దంపతులు కలిసి ఉన్నారు.

More Telugu News