Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Sai Pallavis Saranga Dharia song gets one million likes on You Tube
షార్ట్స్‌లో చూడండి
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ ధరియా' పాట పెద్ద హిట్టయిన సంగతి విదితమే. మంగ్లీ పాడిన ఈ పాట యూ ట్యూబ్ లో ఇప్పటికే 93 మిలియన్లకు పైగా వ్యూస్ ను పొందింది. ఇక ఈ పాట తాజాగా మరో ప్రత్యేకతను కూడా సంతరించుకుంది. యూట్యూబ్ లో తక్కువ కాలంలో 1 మిలియన్ లైక్స్ ను ఇది పొందింది.
*  మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' చిత్రాన్ని జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి కేరళలో జరుగుతోంది. వెంకటేశ్, మీనా తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు.
*  ఆమధ్య గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' చిత్రం మంచి హిట్టయింది. జాతీయ అవార్డు కూడా పొందింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో మరో సినిమా రూపొందనుంది. దీపావళి నుంచి ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందట.
*  విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'ఎనిమీ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల నెల రోజుల పాటు దుబాయ్ లో జరిగింది. త్వరలోనే రెండో షెడ్యూలు చెన్నైలో మొదలవుతుంది. ఇందులో ఆర్య మరో కీలక పాత్రను పోషిస్తున్నాడు.
Go Back to Shorts
Sai Pallavi
Mangli
Venkatesh
Nani
Vishal

More Telugu News