సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ భామ?
- తమిళనాడులో పవన్ సినిమా షూటింగ్
- నాని సినిమాలో కీలక పాత్రలో రాహుల్
- 'అహం బ్రహ్మాస్మి'లో సాయితేజ్ గెస్ట్ రోల్
* మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ జనవరిలో జరిగింది. తిరిగి రెండో షెడ్యూలును వచ్చే నెలలో తమిళనాడులోని గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
* నాని కథానాయకుడుగా రూపొందుతున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని రాహుల్ వెల్లడిస్తూ, ఈ చిత్రంలో తాను సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నానని పేర్కొన్నాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
* మంచు మనోజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో 'అహం బ్రహ్మాస్మి' పేరిట ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో మెగా హీరో సాయితేజ్ గెస్ట్ పాత్రలో నటిస్తాడంటూ వార్తలొస్తున్నాయి. మనోజ్, సాయితేజ్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే!