ఇక కరోనా నివారణకు సింగిల్ డోస్ వ్యాక్సిన్... యూరప్ లో అనుమతి
- ఇప్పటివరకు కరోనా నివారణకు రెండు డోసుల వ్యాక్సిన్లు
- సింగిల్ డోస్ టీకా అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్
- అనుమతి మంజూరు చేసిన ఈఎంఏ
- జాన్సన్ అండ్ జాన్సన్ అందించిన డేటా భేషుగ్గా ఉందన్న ఈఎంఏ
జాన్సన్ అండ్ జాన్సన్ అందించిన వ్యాక్సిన్ డేటాను సమగ్రంగా పరిశీలించిన మీదటే అనుమతి ఇచ్చినట్టు యూరప్ డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ఈ సింగిల్ వ్యాక్సిన్ సమర్థ పనితీరుతో ప్రజల జీవితాలను సురక్షితంగా ఉంచుతుందని భావిస్తున్నట్టు ఈఎంఏ వర్గాలు వెల్లడించాయి.