స్వాతంత్ర్య దినోత్సవానికి 259 మందితో జాతీయ కమిటీ.. సభ్యులుగా కేసీఆర్, జగన్, చంద్రబాబు, రామోజీరావులకు చోటు
- ప్రధాని మోదీ సారథ్యంలో కమిటీ
- వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు చోటు
- ఎల్లుండి తొలి సమావేశం
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, దర్శకుడు రాజమౌళి, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, మిథాలీరాజ్ తదితరులకు చోటు కల్పించారు.
అలాగే, సినీ రంగం నుంచి రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఏఆర్ రహమాన్, లతామంగేష్కర్, ఇళయరాజా, ఏసుదాస్ తదితరులకు చోటు దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలి? ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి? అన్న దానిని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఎల్లుండి ఈ కమిటీ తొలిసారి సమావేశం అవుతుంది.