చంద్రబాబును చూసి మండుటెండలోనూ మంత్రులు వణుకుతున్నారు: అచ్చెన్నాయుడు
- రాష్ట్రంలో పర్యటించే హక్కు ప్రతిపక్ష నేతకు లేదా?
- అక్రమాలు బయటపడతాయనే అనుమతి నిరాకరణ
- శాంతియుత నిరసనకు అనుమతి ఎందుకు ఇవ్వరు?
వేలాదిమందితో కుల సంఘాలు నిర్వహించే సమావేశాలకు, ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రభుత్వం తమ శాంతియుత నిరసనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు. చంద్రబాబు పర్యటనను చూసి మండుటెండలోనూ వైసీపీ నేతలు వణుకుతున్నారని అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో తాము చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే తమ నిరసనకు అనుమతి ఇవ్వలేదని అచ్చెన్న మండిపడ్డారు. వైసీపీ వైఫల్యాలు, అవినీతి, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.