ముంబయిలోని తన భవంతి హోదాను నివాసం స్థాయికి మార్చిన సోనూ సూద్
- వివాదంలో చిక్కుకున్న సోనూ సూద్ భవంతి
- నివాసాన్ని హోటల్ గా మార్చారని ఆరోపణలు
- అనుమతుల్లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారన్న అధికారులు
- బాంబే హైకోర్టులో సోనూ పిటిషన్
- పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం
ఈ మేరకు బీఎంసీ సోనూ సూద్ కు నోటీసులు పంపగా, ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సోనూ సూద్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సోనూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే సోనూ సూద్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
అంతేగాకుండా, జుహూలోని తన భవంతి హోదాను హోటల్ నుంచి నివాసం స్థాయికి మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఈ మేరకు సోనూ సూద్ కు చెందిన ఆర్కిటెక్టులు తగిన పత్రాలను బీఎంసీకి సమర్పించారు. దీనిపై సోనూ సూద్ ను మీడియా ప్రశ్నించగా, తాను నియమ నిబంధనలను పాటిస్తానని అన్నారు.