ఇలాంటి రాజకీయాన్ని రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా?: చంద్రబాబు
- వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజం
- వైసీపీకి ఓటు వేయలేదని ఆస్తులు కూలగొట్టిస్తున్నారని ఆగ్రహం
- అటవిక చర్యలను ఖండిస్తున్నట్టు ప్రకటన
- ఇది ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు
"మీ ప్రత్యర్థిని గెలిపించారని ప్రజలపై పగబట్టి వారి వ్యక్తిగత ఆస్తులు కూల్చుతారా?ఇలాంటి రాజకీయాలను రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా?" అని చంద్రబాబు నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో ఓ పొక్లెయిన్ ఇంటి ర్యాంపును కూల్చుతుండగా, ఆ ఇంటి యజమాని పొక్లెయిన్ కు అడ్డంపడుతున్న దృశ్యం కనిపిస్తోంది.