పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టిన కాంగ్రెస్
- కృష్ణా జిల్లా, చిలుకూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కైవసం
- నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం
- బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు పంచాయతీకి నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు గొంది సురేశ్ విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో చివరికి కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించాడు. దీంతో స్థానిక నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.