మరో ఉద్యమం ఎందుకు తప్పదో చంద్రబాబు సెలవిస్తే బాగుంటుంది: ఐవైఆర్
- విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరంపై చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్
- తెలంగాణ ఆత్మగౌరవం నిజాం షుగర్స్
- తమరు అధికారంలో ఉన్నప్పుడే అమ్మడం జరిగింది
- ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు నాంది పలికారు
'మరో ఉద్యమం ఎందుకు తప్పదో వివరంగా సెలవిస్తే బాగుంటుంది. తెలంగాణ ఆత్మగౌరవమైన నిజాం షుగర్స్ ను తమరు అధికారంలో ఉన్నప్పుడే పూర్తి పారదర్శకత లేని విధానం ద్వారా అమ్మడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు నాంది పలికిన రాష్ట్రస్థాయి నాయకులలో తమరు ముందున్నారు' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.
కాగా, ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే ఆ బిడ్డింగ్ లో తమ ప్రభుత్వం పాల్గొనడం జరుగుతుందంటూ వైసీపీ మంత్రులు అంటున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఇందులో మరో కుట్ర కోణం ఉన్నట్లు ఉందంటూ ట్వీట్ చేశారు. ప్రైవేటీకరణ పేరుతో మీరే బిడ్డింగ్ లో ఉంటే సొంత వాళ్లకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కేంద్రం అధీనంలోనే ఉండాలని ఆయన చెప్పారు.