ఈ నెల 7న సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్
- ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
- రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధుల హాజరు
- సంస్థాగత నిర్ణయాలపై చర్చించనున్న అధినాయకత్వం
ఈ సమావేశంలో పార్టీ పరమైన అంశాలపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ వార్షిక మహాసభ (ఏప్రిల్ 27), ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.