gun: అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం.. ఆరుగురి మృతి

  • ఇండియానాలో ఘ‌ట‌న‌
  • దుండగుడి కాల్పులు
  • మృతుల్లో ఒకరు గ‌ర్భిణి 
  • ఆసుపత్రిలో ఒకరికి చికిత్స  
six shot dead

అమెరికాలో తుపాకీ సంస్కృతి మ‌రో ఆరుగురి ప్రాణాలు తీసింది. అక్కడి ఇండియానాలో కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు పాల్ప‌డ‌డంతో గర్భిణీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌ను ఇండియానా పోలిసు మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండిస్తూ ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ దారుణ ఘ‌ట‌న‌పై పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు ప్రారంభించార‌ని వివరించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, దశాబ్ద కాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని అక్క‌డి పోలీసులు తెలిపారు.

ఈ ఘ‌ట‌నలో మ‌రో మైన‌ర్‌కి తీవ్ర‌గాయాలు కాగా ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంద‌ని పోలీసులు వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆ మైన‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. అడ‌మ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు వివ‌రించారు. దుండ‌గుడు ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండ‌గుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు చెప్పారు.

More Telugu News