అమెరికాలో మరో రకం కరోనా... బ్రిటన్ రకంతో పాటు విజృంభిస్తున్న వైనం!
- అమెరికాలో రోజువారీ కేసులు, మరణాల పెరుగుదల
- అమెరికా రకం కరోనా వల్లనే అని గుర్తించిన నిపుణులు
- ఇప్పటికే అమెరికాలో బ్రిటన్ కరోనా స్ట్రెయిన్
- రాష్ట్రాలకు హెచ్చరికలు చేసిన వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్
దీనిపై వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్ రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది. అమెరికా రకం కరోనా స్ట్రెయిన్ తో 50 శాతం అధికంగా వ్యాప్తి ఉండొచ్చని పేర్కొంది. మాస్కులు ధరించకపోయినా, భౌతికదూరం నిబంధనలు కచ్చితంగా పాటించకపోయినా దీని ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, రూపాంతరం చెందిన కరోనా వైరస్ రకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.