బీజేపీ ‘రామతీర్థ ధర్మయాత్ర’.. ఎక్కడికక్కడ నేతల గృహనిర్బంధం
- కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ ఆగ్రహం
- బీజేపీ నేతల హౌస్ అరెస్ట్‌లపై కన్నా ఆగ్రహం
- రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగుతోందని మండిపాటు
కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేయగా, పార్వతీపురంలో బీజేపీ నేత ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే, మరో 25 మంది బీజేపీ నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చి నిర్బంధించారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగుతోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.