Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: 349 పాజిటివ్ కేసులు, ఇద్దరి మృతి

AP Corona cases details
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 46,386 కరోనా టెస్టులు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 105 పాజిటివ్ కేసులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 67, గుంటూరు జిల్లాలో 34, అనంతపురం జిల్లాలో 31 కొత్త కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో గడచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇతర జిల్లాల్లో చూస్తే... పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 8 చొప్పున కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 422 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,81,061 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,70,342 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,625 అని తాజా బులెటిన్ లో వెల్లడించారు. మొత్తం మరణాల సంఖ్య 7,094కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Update
Details
Positive Cases
Deaths
Active Cases

More Telugu News