హారికకు ఆ విషయాన్ని చాలా సార్లు చెప్పాను: బిగ్ బాస్ విన్నర్ అభిజిత్
- హారిక నాకు చెల్లెలు లాంటిది
- ఇదే విషయాన్ని ఆమెకు చాలాసార్లు చెప్పాను
- అయితే ఈ విషయం బయటకు రాలేదు
హారిక తనకు చెల్లెలు లాంటిదని అభిజిత్ చెప్పాడు. ఇదే విషయాన్ని హౌస్ లో హారికకు తాను చాలా సార్లు చెప్పానని తెలిపారు. తనకు తమ్ముడు ఉన్నాడని, హారికలాంటి చెల్లెలు ఉంటే బాగుండేదని అనుకునేవాడినని చెప్పాడు. ఈ విషయాన్ని హారికకు చెప్పానని... అయితే తాను ఆమెతో చెపుతున్న ఈ మాటలు బయటకు రాలేదని అన్నాడు.
మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ ఫుల్ జోష్ లో ఉన్నారు. వీరిలో చాలా మందికి ఇప్పటికే సినిమాలలో ఆఫర్లు వచ్చాయి.