తీవ్ర వివాదంలో హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ పెళ్లి... స్పందించిన మలేసియా ప్రభుత్వం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తీవ్ర వివాదంలో హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ పెళ్లి... స్పందించిన మలేసియా ప్రభుత్వం!

Contraversy on Hockey Captain Manpreet and Eli Rajwa Marriage
  • మలేసియా స్నేహితురాలు ఇలి నజ్వాను పెళ్లాడిన మన్ ప్రీత్
  • పంజాబీ సంప్రదాయంలో జరిగిన వివాహ వేడుక
  • ఇలీ నజ్వా ముస్లిం కావడంతో మలేసియాలో తీవ్ర వివాదం
  • తమకు చెప్పకుండా వెళ్లిందన్న మలేసియా ఉప ప్రధాని
  • మతం మార్చుకోకుండా పెళ్లాడితే తీవ్ర నేరమేనని వ్యాఖ్య
ఇండియా హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, తన స్నేహితురాలు మలేసియాకు చెందిన ఇలి నజ్వా సిద్ధిఖీని జలంధర్ లో గతవారం వివాహం చేసుకోగా, తీవ్ర వివాదం చెలరేగింది. ఈ వివాహం పంజాబీ సంప్రదాయంలో జరగడమే ఇందుకు కారణం. మరిన్ని వివరాల్లోకి వెళితే, మలేసియాలో ముస్లిం మత సంప్రదాయాలను చాలా నిక్కచ్చిగా పాటించాలి. ఇక ముస్లింలు ఏ మాత్రం గీత దాటినా చాలా కఠినమైన శిక్షలుంటాయి.

మన్ ప్రీత్ సింగ్ ఇలి నజ్వాను పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం, ఆ చిత్రాలు వైరల్ కావడంలో పలువురు మలేసియన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. ఆమె మతం మార్చుకుందా? ముస్లిం అయ్యుండి ఇలాంటి వివాహం ఏంటని, అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలకు దిగడంతో ఆ దేశంలో పెద్ద చర్చే జరుగుతుండటంతో ప్రభుత్వం స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది.

మలేసియా ఉప ప్రధాని, మత వ్యవహారాలను పరిశీలించే అహ్మద్ మర్జుక్ స్వయంగా ఈ వివాహంపై స్పందిస్తూ, తమకు ఇలి నజ్వా పెళ్లిపై సమాచారం లేదని అన్నారు. విమానాల్లో ప్రయాణాలకు ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపిన ఆయన, నజ్వా అనుమతి తీసుకునే ఇండియాకు వెళ్లిందని అన్నారు. ఆమె తన పెళ్లిపై స్వదేశానికి వచ్చి, అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సివుందని అన్నారు.

ఆమె సొంత రాష్ట్రం అధికారుల నుంచి కూడా వివరాలను కోరామని, విదేశాల్లో వివాహం చేసుకోవాలంటే, ముందుగా అనుమతి తీసుకోవాలని, కానీ ఆమె ఎలాంటి దరఖాస్తు పంపలేదని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, ఆమె ఇప్పటికీ మతం మారలేదని, ముస్లింగానే ఉంటూ పంజాబీని వారి సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్టు తేలితే మాత్రం తప్పు చేసినట్టుగానే భావించాల్సి వుంటుందని మర్జుక్ తెలిపారు. ఈ విషయంలో కొత్త జంట స్పందించాల్సి వుంది.
Manpreet Singh
Eli Nazwa
Marriage
Muslim

More Telugu News