కరోనా కొత్త వెర్షన్ వస్తోంది... బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన యూరప్ దేశాలు
- బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్తరకం వైరస్
- వేగంగా వ్యాపిస్తున్న నూతన వైరస్
- పరిస్థితి చేయిదాటిపోయిందన్న బ్రిటన్
- అప్రమత్తమైన యూరప్ దేశాలు
- బ్రిటన్ విమానాలపై నిషేధం బాటలో జర్మనీ
కరోనా కొత్తరకం వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్ లో లాక్ డౌన్ విధించారు. ఈ నూతన రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. దీనిపై బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హేంకాక్ మాట్లాడుతూ, కరోనా కొత్తరకం వైరస్ తమ చేయి దాటిపోయిందని నిస్సహాయత వ్యక్తం చేశారు.