ట్రక్కుతో 8 సార్లు ఆసుపత్రిని ఢీ కొట్టిన వ్యక్తి.. 15 వాహనాలు ధ్వంసం.. వీడియో ఇదిగో
- హరియాణాలోని గురుగ్రామ్‌లో ఘటన
- బసాయి చౌక్ బాలాజీ ఆసుపత్రి వద్ద బీభత్సం
- కుటుంబ సభ్యులతో గొడవపడి దారుణానికి పాల్పడ్డ వ్యక్తి
వాహనంతో అతడు దాదాపు 15 వాహనాలను ధ్వంసం చేశాడని బాలాజీ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఆ వ్యక్తికి చెందిన కుటుంబంలోని ఇద్దరికి తమ ఆసుపత్రిలోనే చికిత్స అందుతోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఈ ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.