బిగ్ బాస్ విజేతపై రాంగ్ లీక్ లు... అసలు గెలిచింది ఎవరంటే..?!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ విజేతపై రాంగ్ లీక్ లు... అసలు గెలిచింది ఎవరంటే..?!

Wrong Leaks on Biggboss Telugu Winner
  • నిన్న అరియానా గెలిచినట్టు సోషల్ మీడియాలో లీకులు
  • అభిజిత్ కు 58 శాతం వీక్షకుల ఓటింగ్
  • 18 శాతానికే పరిమితమైన అరియానా
  • మరికొన్ని గంటల్లో విజేత వివరాలు వెల్లడి
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు పోటీదారులు ఉండగా, ఒకరే విజేతగా నిలిచి, రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ప్రారంభమైన తరువాత ప్రతి వారం ఎలిమినేట్ ఎవరు అవుతారన్న విషయమై సోషల్ మీడియా ముందుగానే చెప్పేస్తోందన్న సంగతి విదితమే. టీవీలో ప్రేక్షకులు చూస్తున్న హౌస్ సీన్లు, ఒక రోజు ముందుగా రికార్డు అయ్యేవే. వాటిని రికార్డు చేసేవారు, వారాంతంలో పాల్గొనే ప్రేక్షకులు... ఎవరి ద్వారానో ఎలిమినేషన్ విషయాలు లీక్ అవుతూనే ఉన్నాయి.

అయితే, ఆఖరి వారం విషయంలో మాత్రం లీకు వీరులకు బిగ్ బాస్ షాకిచ్చాడు. అదేంటంటే, ఈ సీజన్ లో విజేతగా అరియానా నిలిచినట్టుగా వార్తలు వచ్చాయి. వీటిని స్వయంగా నిర్వాహకులే బయటకు వదిలినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ప్రేక్షకుల ఓటింగ్ పరంగా చూస్తే హౌస్ లో అభిజిత్ విజేత కావాలని 58 శాతం ఓట్లు వచ్చాయని ఓటింగ్ సరళి చూపుతోంది. అరియానా రెండో స్థానంలో ఉండి 18 శాతం ఓట్లను సాధించగా, మిగతా పోటీలో ఉన్న సొహైల్ హారిక, అఖిల్ నామమాత్రపు ఓట్లతోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో అభిజిత్ విజేత కావడం ఖాయమని, ఇందుకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తయిపోయిందని తెలుస్తోంది. ఈ ఉదయం ఓ చీఫ్ గెస్ట్ ను వేదికపైకి తెచ్చి, మిగతా భాగం షూటింగ్ ను తీసి, సాయంత్రం ప్రసారం చేస్తారని బిగ్ బాస్ వర్గాలు అంటున్నాయి. ఇక ఓ మహిళ బిగ్ బాస్ విజేతగా నిలవాలని భావిస్తున్న వారు మాత్రం ఓటింగ్ తో సంబంధం లేకుండా, హౌస్ లో గట్టి పోటీదారుగా ఉన్న అరియానా గెలిచినట్టు చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.

హిందీ బిగ్ బాస్ 14వ సీజన్ ప్రస్తుతం నడుస్తుండగా, గడచిన 13 సీజన్లలో ఐదుగురు మహిళలు విజేతలుగా నిలిచారు. ఇక, తెలుగులో మాత్రం గత మూడు సీజన్లలో పురుషులే విజేతలు. సీజన్ 1లో హరితేజ, అర్చన చివరిదాకా ఉన్నా టైటిల్ దక్కలేదు. సీజన్ 2లో గీతామాధురి రెండో స్థానంలోనిలవగా, సీజన్ 3లో యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా ఉంది. ఈ నాలుగో సీజన్ లో అరియానా లేదా దేత్తడి హారికలలో ఒకరు రన్నరప్ గానే మిగులుతారా? లేక అనూహ్య పరిణామాల మధ్య అభిజిత్ ను అధిగమించి టైటిల్ దక్కించుకుంటారా? వీరెవ్వరూ కాకుండా అఖిల్, సొహైల్ లో ఒకరిని విజేతగా ప్రకటిస్తారా? అన్నది తెలియాలంటే, మరికొన్ని గంటలు వేచి చూడాలి.

Ariyana
Bigg Boss
Abhijit
Sohile
Harika
Winner

More Telugu News