David Werking: తన పోర్న్ వీడియోలు ధ్వంసం చేశారంటూ తల్లిదండ్రులపై దావా వేసిన ఘనుడు!

Michigan man sues his parents
  • అమెరికాలో ఘటన
  • పోర్న్ కు బానిసైన డేవిడ్ వెర్కింగ్
  • వీడియోలు నాశనం చేసిన తల్లిదండ్రులు
  • 2018లో తల్లిదండ్రులపై కోర్టును ఆశ్రయించిన డేవిడ్
  • 75 వేల డాలర్ల పరిహారం కోరిన వైనం
  • డేవిడ్ కు అనుకూలంగా కోర్టు తీర్పు
తమ పిల్లలు అశ్లీల వీడియోలు చూడడాన్ని ఏ తల్లిదండ్రులైనా హర్షించరు. అమెరికాలోని మిచిగాన్ కు చెందిన డేవిడ్ వెర్కింగ్ (42) అనే వ్యక్తి పోర్న్ కు బానిస అవ్వడాన్ని అతడి తల్లిదండ్రులు బెర్త్, పాల్ వెర్కింగ్ భరించలేకపోయారు. అతడి వద్ద ఉన్న అశ్లీల వీడియోలను, సంబంధిత వస్తువులను వారు ధ్వంసం చేశారు. అయితే డేవిడ్ తన పోర్న్ వీడియో లైబ్రరీ నాశనం కావడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులపై కోర్టును ఆశ్రయించాడు. తన వీడియోలను ధ్వంసం చేశారంటూ 75 వేల డాలర్లకు దావా వేశాడు.

ఈ ఘటన 2018లో జరిగింది. తన పోర్న్ వీడియోల విలువ 25 వేల డాలర్లు ఉంటుందని, అందుకు మూడింతలు తన తల్లిదండ్రులు చెల్లించాల్సిందేనంటూ డేవిడ్ తన దావాలో పేర్కొన్నాడు. తాజాగా దీనిపై తీర్పు వెలువరించిన న్యాయస్థానం, డేవిడ్ కు పరిహారం చెల్లించాలంటూ అతడి తల్లిదండ్రులు బెర్త్, పాల్ వెర్కింగ్ లను ఆదేశించింది.
David Werking
Sue
Parents
Michigan
USA

More Telugu News