Saiyami Kher: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాగార్జున పట్ల బాలీవుడ్ భామ అభిమానం 
  • సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ  
  • ఓ ఇంటివాడైన టాలీవుడ్ దర్శకుడు
Saiyami Kher says she has become fan of Nagarjuna

*  తాను నాగార్జునకు అభిమానినైపోయానని అంటోంది బాలీవుడ్ భామ సయామీ ఖేర్. ప్రస్తుతం నాగార్జునతో కలసి 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న సయామీ చెబుతూ, నాగార్జునతో పనిచేశాక ఆయనకు ఫ్యాన్ అయిపోయాననీ, నాగ్ తో పనిచేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పింది.
*  ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న నందమూరి బాలకృష్ణ దీని తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. అనిల్ సుంకర నిర్మించే ఈ చిత్రానికి 'బలరామయ్య బరిలో దిగితే' అనే టైటిల్ని నిర్ణయించారు.
*  'మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా' వంటి హిట్ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ పెళ్లిచేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. గురువారం రాత్రి సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకలో వధువు శ్రీజ గౌని మెడలో తాళికట్టాడు. ఈ వేడుకకు హీరో శ్రీవిష్ణు, నివేద థామస్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News