ఏపీ కరోనా అప్ డేట్: 500 కొత్త కేసులు, 5 మరణాలు
- గడచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా టెస్టులు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 88 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 మందికి పాజిటివ్
- తాజాగా కోలుకున్న వారు 563 మంది
- ఇంకా 4,660 మందికి చికిత్స
అదే సమయంలో 563 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కి పెరిగింది. మరణాల సంఖ్య 7,064కి చేరింది. ఇప్పటివరకు 8,64,612 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,660 మందికి చికిత్స కొనసాగుతోంది.