అమెరికా ఖజానా సమాచారాన్ని హ్యాక్ చేసిన రష్యా హ్యాకర్లు!

US Trasury Department Hack by Russian Hackers
  • కంప్యూటర్ నెట్ వర్క్ హ్యాక్
  • పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న సైబర్ సెక్యూరిటీ వింగ్
  • గతంలోనూ పలు యూఎస్ వెబ్ సైట్ల హ్యాక్
అమెరికా ట్రెజరీ విభాగంలోని కంప్యూటర్ నెట్ వర్క్ ను రష్యా హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని యూఎస్ ప్రభుత్వం స్పష్టం చేస్తూ, ఖజానా సమాచారం ఉన్న నెట్ వర్క్ పై సైబర్ ఆటాక్ జరిగిందని పేర్కొంది. ప్రభుత్వ నెట్ వర్క్ పై జరిగిన దాడి కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఈ విషయంలో టెక్నాలజీ నిపుణులు సహకరిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజన్సీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

నెట్ వర్క్ ను తిరిగి సరిదిద్దేందుకు సీఐఎస్ఏ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని, హ్యాకింగ్ కు గురైన విభాగాలను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. కాగా, ఈ సైబర్ దాడి గత వారం జరిగిందని పేర్కొన్న 'వాషింగ్టన్ పోస్ట్', కస్టమర్ల కంప్యూటర్ సిస్టమ్స్ ను పరిశీలిస్తుండే టూల్స్ ను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. ఈ సైబర్ దాడి రష్యా ప్రభుత్వం అండతోనే జరిగిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ 'ఫైర్ ఐ' వెల్లడించింది.

రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు చెందిన ఓ గ్రూప్ ఈ పని చేసుంటుందని భావిస్తున్న ఎఫ్బీఐ, సైబర్ దాడిపై విచారణ ప్రారంభించింది. కాగా, ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇవే టీమ్ పలు ప్రభుత్వ ఏజన్సీల వెబ్ సైట్లపై దాడి చేసి, విలువైన సమాచారాన్ని దొంగిలించాయన్న ఆరోపణలు ఉన్నాయి.
Go Back to Shorts
USA
Treasury
Hack
Russia

More Telugu News