నాడు తల్లి ధరించిన చీరలో నేడు నిహారిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాడు తల్లి ధరించిన చీరలో నేడు నిహారిక!

Niharika wears her mother engagement saree
  • మెగా ఇంట్లో పెళ్లి బాజాలు
  • డిసెంబరు 9న నిహారిక వివాహం
  • రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్
  • తల్లి నిశ్చితార్థపు చీరలో తళుక్కుమన్న నిహారిక
  • 32 ఏళ్ల నాటి చీర అంటూ వెల్లడి
మెగా ఇంట పెళ్లి సందడి నెలకొంది. నాగబాబు కుమార్తె నిహారిక వివాహం ఈ నెల 9న జొన్నలగడ్డ చైతన్యతో జరగనుంది. నిహారిక పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో నిర్వహించాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించింది. అందుకే రాజస్థాన్ లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, తాజాగా నిహారిక సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో నిహారిక సంప్రదాయబద్ధంగా చీరకట్టులో కనిపించింది.

అయితే, ఆ ఫొటోలో నిహారిక కట్టుకున్న చీర ఇప్పటిది కాదట. నాడు నిహారిక తల్లి పద్మజ తన నిశ్చితార్థం సమయంలో కట్టుకున్న చీరనే ఇప్పుడు నిహారిక ధరించింది. తన ఫొటో పక్కనే తల్లి నిశ్చితార్థం ఫొటోను కూడా నిహారిక పంచుకుంది. 32 ఏళ్ల నాటి చీర అంటూ నిహారిక వెల్లడించింది.
Niharika Konidela
Wedding
Saree
Mother
Padmaja
Engagement

More Telugu News