టీఆర్ఎస్ నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు: ఒవైసీ
- మేయర్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ
- పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
- బీజేపీ గెలుపు తాత్కాలికం మాత్రమే
తాజాగా ఇదే అశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, గ్రేటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీఆర్ఎస్ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. ఫలితాలను ఎన్నికల సంఘం పూర్తిగా ప్రకటించిన తర్వాత పార్టీలో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఒవైసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తాత్కాలికం మాత్రమేనని చెప్పారు.