ప్రేయసి శ్వేతా అగర్వాల్ ను పెళ్లాడిన ఉదిత్ నారాయణ్ కుమారుడు!
- పదేళ్లుగా శ్వేతతో ప్రేమాయణం
- పెద్దలు అంగీకరించడంతో నిన్న వివాహం
- ముంబై ఇస్కాన్ టెంపుల్ లో ఒకటైన జంట
ఇక పెళ్లికి ముహూర్తం సిద్ధం కాగా, ఆదిత్యతో కలిసి అతని తల్లి దీపా నారాయణ్ బారాత్ లో చేసిన సందడికి సంబంధించిన వీడియో అందరినీ అలరిస్తోంది. తండ్రిలాగే గాయకుడిగానూ సినీ అభిమానులకు పరిచితమైన ఆదిత్య, టీవీ షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. శ్వేతతో కలిసి 'షాపిత్' అనే చిత్రంలో నటించి, నటుడిగానూ తానేంటో నిరూపించుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు సాగిన వీరి ప్రేమ, చివరకు ఏడడుగుల బంధం దిశగా దారితీయడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు శుభాభినందనలు తెలుపుతున్నారు.