మళ్లీ బాక్సింగ్ రింగ్ లో దిగిన మహాబలుడు మైక్ టైసన్
- రాయ్ జోన్స్ తో టైసన్ ఎగ్జిబిషన్ బౌట్
- డ్రాగా ముగిసిన పోరు
- వయసు పెరిగినా చేవ తగ్గని టైసన్
మైక్ టైసన్ చివరిసారిగా 2005లో కెవిన్ మెక్ బ్రైడ్ తో బౌట్ లో పాల్గొన్నాడు. ఇందులో టైసన్ కు పరాజయం ఎదురైంది. తాజా పోరులో టైసన్ ఎక్కువగా బాడీ షాట్స్ కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పవర్ పంచ్ లను తట్టుకోవడం రాయ్ జోన్స్ జూనియర్ కు శక్తికి మించిన పనైంది. టైసన్ సంధించిన బాడీ షాట్స్ కారణంగానే తాను త్వరగా అలిసిపోయానని బౌట్ అనంతరం రాయ్ జోన్స్ వెల్లడించాడు.
కాగా ఈ బౌట్ లో తొలి రౌండ్ లో రాయ్ జోన్స్ ఆధిపత్యం సాగించగా, రెండో రౌండ్ లో ఇద్దరూ సమవుజ్జీలుగా నిలిచారు. మూడో రౌండ్ లో టైసన్ హవా సాగింది. ఈ ఎగ్జిబిషన్ బౌట్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో జరిగింది.