బాలుడికి ఫోన్ చేసి మెచ్చుకున్న కమల హ్యారిస్
- కమల హ్యారిస్ చిత్రాన్ని గీసిన 14 ఏళ్ల బాలుడు
- సామాజిక మాధ్యమాల్లో పోస్ట్
- కమలా హ్యారిస్ హర్షం
తనతో మాట్లాడుతున్నది కమల హ్యారిస్ అని తెలుసుకున్న ఆ బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ సందర్భంగా కమల ఆ బాలుడిపై ప్రశంసలు కురిపించింది. అద్భుత ప్రతిభ కనబర్చాడని మెచ్చుకున్నారు. అతడి కళాత్మకతతో తన హృదయం నిండిపోయిందని చెప్పారు.
అతడు తన చిత్రాన్ని వేయడమన్నది తనకు చాలా ప్రత్యేకమైన విషయమని తెలిపారు. ఈ సంభాషణను కూడా టైలర్ ట్వీట్ చేశాడు. అది కూడా వైరల్ అవుతోంది. గతంలో తాను వేసిన చిత్రాన్ని కమల హ్యారిస్‌కు చేరుకునేలా సాయం చేసిన హిల్లరీ క్లింటన్ కూతురు చెల్సీ క్లింటన్‌కు ట్విట్టర్ ద్వారా టైలర్ ధన్యవాదాలు తెలిపాడు.